కోటీశ్వరులు అవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

in #salt5 years ago

శ్రీ మాత్రే నమః || పూజఫలం తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రజలందరికి ధనం సంపాదించడానికి వేరు వేరు వృత్తులు చేస్తూ ఉంటారు. కానీ అందరు కోటీశ్వరులు కాలేరు ఎందుకని అంటే వారికి లక్ష్మి కటాక్షం ఉండదు. అలాగే మనం చేసే తప్పులు వల్ల డబ్బు అనేది మనకు కొంత మేర మాత్రమే వస్తుంది.

చాలా మంది కోటీశ్వరులు కావాలి అని కలలు కంటారు. మీరు కూడా కోటీశ్వరులు కావాలి అంటే ఇప్పుడు మనం కొన్ని చిన్న చిట్కాలు తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయట పడాలి అంటే మనం ఇప్పుడు ఈ క్రింద తెలిపిన చిట్కాలు తెలుసుకుందాం.

నిజజీవితంలో కొన్నిప్రత్యేక వస్తువులను ఉపయోగిచడం ద్వారా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి ఐశ్వర్యవంతులు కావడానికి గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకీ ఆ వస్తువులుఏమిటో తెలుసుకుందామా మరి!

ఉప్పు, గాజు గ్లాసు ఈ రెండిటిని ఉపయోగించి మీరు ఎంత ఐశ్వర్యవంతులు అవుతారో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఐశ్వర్యవంతులు ఉప్పు, గాజు గ్లాసు తో ఎలా అవుతారో తెలియాలి కదా! ఉప్పు ని గాజు గ్లాసు లో పోసి ఒక చోట ఉంచాలి.

అసలు ఉప్పు గాజుగ్లాసు ఈ రెండు మాత్రమే ఎందుకు వాడాలి? ఉప్పు అనేది శనికి ప్రీతిపాత్రమైనది. అలాగే గాజు రాహువుకి మిక్కిలి ఇష్టమైనది. అందువల్ల మనం పదార్థాలను ఉపయోగించి ఐశ్వర్య వంతులు అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నవగ్రహాలలో అందరికీ శని యొక్క కటాక్షం కలగాలని కోరుకుంటారు అలాగే రాహువు కటాక్షం కలగాలని కోరుకుంటారు. ఏకకాలంలో రాహువు అలాగే శనీశ్వరుడు ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధి విధానాన్ని ఉపయోగిస్తున్నాము.

ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఘల్లు ఉప్పు (సముద్రపు ఉప్పు) పోసి, ఆ కాజు గ్లాసు కింద ఒక ప్లేటును ఉంచి దానిని మీయొక్క స్నానాల గదిలో ఒక మూల ఉంచాలి. ఇలా చేయడం వల్ల మనకు ఏకకాలంలో శనీశ్వరుడు, రాహువు ప్రసన్నమవుతారు.

ఇలా గాజు గ్లాస్ లో ఉప్పు పోసి స్నానాల గదిలో పెట్టడానికి వీలుకానివారు ఇంటిలో ఏదో ఒక మూల ఉంచిన ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవటానికి మిక్కిలి అవకాశం ఉన్నది.

ఇలా మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారా అయితే మా యొక్క ఈ ఈ పూజ ఫలం అనే వెబ్ సైట్ ని దర్శిస్తూ ఉండండి. మీకోసం మరిన్ని ఉపయోగకరమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము శతవిధాల ప్రయత్నిస్తాము. అలాగే మీయొక్క అమూల్యమైన కామెంట్లు కింద కామెంట్ బాక్స్ లో వివరించండి.

సర్వేజనాః సుఖినోభవంతు స్వస్తి||